మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణం చేయనున్నారు. సీఎం పదవికి ఆయన పేరును కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపాదించాయి.
అనేక మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు విషయమై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది. మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాక్రే పేరును ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రతిపాదించాయి. దీంతో సీఎం పీఠాన్ని దక్కించుకోవాలన్న శివసేన కోరిక నెరవేరనుంది. కాంగ్రెస్, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించారు