అన్ని మాసాలలో కార్తీకమాసం అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు.కార్తీకమాసంలో మిగిలిన అన్ని రోజులూ చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు. పున్నమినాడు చేసేవన్నీ ఒక ఎత్తు. కార్తీక పున్నమికి అంతటి విశిష్టత ఉంది చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం'. ఇందులో కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైనదిగా భావించ బడుతుంది కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రం, నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొప్పలో ఉంచి నదిలో లేదా కొలనులో విడిచిపెడతారు. మరి కొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. అలా వీలుకాని వారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.
ఇళ్ళల్లో తులసి కోట వద్ద దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధనతో ముక్కోటి దేవతల పూజాఫలం, సకల పుణ్య నదుల స్నాన ఫలం దక్కి ఇహ పరలోకంలో సుఖ సౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పురాణవచనం. ఈ రోజున కేదాశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా పెట్టి, పూజలు చేయడం ప్రాచీన కాలం నుంచి సంప్రదాయంగా వస్తుంది. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం.
కార్తీక పౌర్ణమి విశిష్టత