తెలంగాణ వద్దు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు


.ఏపీలోని ప్రతిపక్షాలు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, ఆయన ఏపీలో వాలంటీర్లు.. సచివాలయ ఉద్యోగాల పేరుతో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని వైసీపీ నేతలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, సొంత పార్టీ వారికే ఈ ఉద్యోగాలు దక్కాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వ్యవహారంలో తెలంగాణలో కొత్త డిమాండ్ కు కారణమైంది.పశు వైద్య విద్యార్ధుల సంఘం ఒక బ్యానర్ తో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రదర్శించిన బ్యానర్ లో తెలంగాణ వద్దు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు అనే నినాదం ఉంది. దీని ద్వారా కేవలం ఏపీలో ఇస్తున్న ఉద్యోగాల కారణంగానే వారు ఈ డిమాండ్ తెర పైకి తెచ్చినట్లుగా కనిపిస్తోంది. వారు ఏపీ ముఖ్యమంత్రి ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే..తమకు మాత్రం ఉద్యోగాల కల్పన ఊపే లేదంటూ విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇలా ..సొంత రాష్ట్రంలో జగన్ పాలన పైన ఎటువంటి స్పందన ఉన్నా..తెలంగాణలో మాత్రం అక్కడక్కడా జగన్ కు క్రేజ్ కనిపిస్తోంది. దీంతో..గతంలో రాష్ట్ర విభజన కోసం తీవ్రంగా ఉద్యమం చేసిన వారిలోని కొందరు విద్యార్ధులు ఇప్పుడు ఈ తరహా డిమాండ్లు తెర పైకి తేవటం హాట్ టాపిక్ గా మారింది.