అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన ఘటనకు బాధ్యులైన సభ్యులు, సభ్యులు కానివారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు అప్పగిస్తూ శాసనసభలో తీర్మానం చేశారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులో ఈ ఘటనపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని బుగ్గన విమర్శించారు. ప్లకార్డులు తీసుకురాకూడదన్నది సభ రూల్స్‌లో ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు పెట్టిన అసెంబ్లీ ద్వారాలు.. ఆయనకే కారాగారంలా కన్పిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానానికి వైఎస్సార్‌సీపీ సభ్యులు జక్కంపూడి రాజా, గొల్లపూడి బాబురావు, అంబటి రాంబాబు, అప్పలరాజు, వరప్రసాద్ బలపరిచారు.