ఎంఈలో శిక్షణ..సిపాయిల రక్షణ

ప్రతి సంవత్సరం సుమారు 2,000 మంది సిపాయిలు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. ప్రత్యేకంగా ఎయిర్‌ రైఫిల్‌ పిస్టల్‌, షూటింగ్‌ రేంజ్‌, స్మాల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌ సిమ్యూలేటర్‌ కాంప్లెక్స్‌లో ఫైటింగ్‌లో సిపాయిలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటాం. ఇక్కడ శిక్షణ పొందినవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో ప్రతిభను కనబరిచారు.  -బ్రిగేడియర్‌ సందీప్‌ భల్లా, ఈఎంఈ సెంటర్‌ కమాండెంట్‌


బొల్లారం: దేశ రక్షణ కోసం అహర్నిషలు శ్రమించే సిపాయిలు, ఆర్మీ అధికారులను వివిధ రంగాల్లో సుశిక్షుతులుగా తయారు చేస్తున్నది బొల్లారంలోని 1ఈఎంఈ (ఎలక్ట్రానిక్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌) కేంద్రం. ఈ కేంద్రంలో వివిధ విభాగాల్లో అప్పుడే ఆర్మీలో చేరిన యువకులకు మెళకువలు నేర్పించి, దేశ రక్షణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు.