భారత యువ బ్యాటింగ్ సంచలనం షఫాలీ వర్మ ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఐదు రోజుల క్రితం ఈ 16 ఏళ్ల డైనమైట్ 761 పాయింట్లతో న్యూజిలాండ్ బ్యాట్స్‌వుమన్ సుజి బేట్స్‌ను రెండో స్థానానికి నెట్టి తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. ఆదివారం ఆస్ట్రేలియాతో వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో షఫాలీ(744 పాయింట్లు) కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది.
భారత్‌తో తుది సమరంలో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ 75 రన్స్‌తో రాణించడంతో రెండు ర్యాంకులు ఎగబాకి 762 పాయింట్లతో ఏకంగా నంబర్‌వన్ ర్యాంకుకు చేరింది. కివీస్ బ్యాటర్ సుజి బేట్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్ నుంచి స్మృతి మంధాన ఏడో ర్యాంకులో ఉండగా.. జెమీమా రోడ్రిగ్స్ తొమ్మిదో స్థానం దక్కించుకుంది.