మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా 

---నూడా  చైర్మన్ ప్రభాకర్ రెడ్డి

నిజామాబాద్,డిసెంబర్ 28(తెలంగాణ మేఘ టైమ్): మహిళల పట్ల అసభ్యంగా ఎంపీ అరవింద్ వాక్యాలను బీజేపీ  ఫ్లోర్ లీడర్  స్రవంతి రెడ్డి సమర్థించడం ఆమె దిగజారుడుతనానికి నిదర్శనమని నుడా  చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత పట్ల ఎంపీ అరవింద్ చీరకట్టు పైన  వ్యంగ్యంగా మాట్లాడితే స్రవంతి రెడ్డి మెచ్చుకోవడం సాటి మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బిజెపి ఎంపీ  గొప్ప లీడర్ గా  చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. అసంపూర్తిగా మిగిల్చిన  భూగర్భ డ్రైనేజీ  పనులను మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా సహకారంతో నగరంలో పనులు పూర్తి  చేశామన్నారు. బైపాస్ రోడ్డు పనులు సైతం కమీషన్ల కోసం నిలిచిపోయిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.అభివృద్ధి  విషయంలో ముందున్నా ఎమ్మెల్సీ కవితను  విమర్శిస్తే  ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రజలకు ఒక కార్పొరేటర్ గా అందుబాటులో లేకుండా డివిజన్ సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్సీ కవితను విమర్శించే స్థాయి స్రవంతి  రెడ్డికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో నూడా  డైరెక్టర్లు అక్బర్ ఖాన్,శ్రీ హరి,కార్పొరేటర్లు చరణ్, నవీన్ ధర్మపురి, అక్బర్, విక్రమ్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సాయిరాం తెరాస నాయకులు తెలంగాణ శంకర్ తదితరులు పాల్గొన్నారు.