కేసీఆర్ తుగ్లక్ పాలనకు చామర గీతం పాడాలి

 కేసీఆర్ తుగ్లక్ పాలనకు చామర గీతం పాడాలి.. బొడిగె శోభ రాణి


-ఉద్యోగ నోటిఫికేషన్లు రాకనే సునీల్ ఆత్మహత్య.

-సునిల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శిచిన  బొడిగె శోభ రాణి

 -సునీల్ కుటుంబానికి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ,కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని బీజేపీ డిమాండ్. 

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన చొప్పదండి బిజెపి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభారాణి.గురువారం గూడూరు మండలంలోని గుండెంగా గ్రామం తేజావత్ రామ్ సింగ్ గ్రామపంచాయతీ పరిధిలోని సోమ్లా తండాను బీజేపీ బృందంతో కలిసి  సునీల్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈసందర్భంగా చొప్పదండి బీజేపీ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభరాణి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ తుగ్లక్ పాలనను కొనసాగిస్తున్నారని,కెసిఆర్ గులాబీ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడ లేదని మనస్తాపంతో ఇటీవల సునీల్ తో పాటు మరో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె అన్నారు.తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని సాధించుకున్న తెలంగాణ అప్పుల కొలిమిగా మారిందని,  రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఉద్యోగ పదవీ విరమణ 61 సంవత్సరాలకు పెంచినందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇక రావని రాష్ట్రంలో నిరుద్యోగ యువత మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నిరుద్యోగ చావులను ఆపాలని,  తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే వేయాలని ఆమె డిమాండ్ చేశారు.గూడూరు మండలంలోని తేజావత్ రామ్ సింగ్ తండాలో ఆత్మహత్య చేసుకున్న సునీల్ కుటుంబానికి ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి,కోటి రూపాయలు ఆకుటుంబానికి అందజేసి ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  కెసిఆర్ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి చావులను ఆపాలని ఆమె అన్నారు.  రాష్ట్రంలో సునీల్ తో పాటు మరో ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంతో వారికి కూడా ఇంట్లో నుంచి ఐదు రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈకార్యక్రమంలో మహబూబాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్పూరి వెంకన్న,గాలన్న మెరుగు మల్లయ్య,మేరెడ్డి సురేందర్, బానోత్ వీరన్న నాయక్,బీజేవైఎం జిల్లా నాయకులు గుగులోత్ రాంబాబు నాయక్,చెల్పూరి రాజు,బోడ వెంకన్న,రసమల్ల వెంకటేశ్వర్లు, బానోత్ భాస్కర్ నాయక్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు రావుల రాజేష్, ఉడుత నాగరాజు బానోత్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.