సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన  రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్


సిరికొండ మండలంలోని మైలారం గ్రామానికి చెందిన విద్యాసాగర్ మరణించడంతో అతని కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల చెక్కును సోమవారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అందజేశారు. మైలారం గ్రామానికి చెందిన విద్యాసాగర్ నిజామాబాద్ నగరంలో గోల్డ్ స్మిత్ గా పని చేస్తున్నారు. గత ఏడాది ఆయన గుండెపోటుతో బాంబే నర్సింగ్ హోం లో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. ఆయన వైద్య ఖర్చులకు లక్ష  ఆరవై రెండు వేల రూపాయలు ఖర్చు కాగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పించారు. మృతుడు విద్యాసాగర్ కుమారుడు సాయి కృష్ణకు ఈ చెక్కును అందజేశారు.తమ కుటుంబాన్ని ఆదుకున్న సీఎం కెసిఆర్ కు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ తదితరులు ఉన్నారు.