సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ కన్నుమూత

  1. సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు సామాజిక కార్యకర్త కత్తి మహేష్ ఇకలేరు. 
    ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా కొలుకొంటున్నట్టే కనిపించిన  శనివారం  ఆరోగ్య పరిస్థితి విషమించడంతోఆయనతుదిశ్వాసవిడిచారు. దీంతోఆయనఅభిమానులు,బంధువులుకన్నీరుమున్నీరవుతున్నారు. 
    హైదరాబాద్ నుంచి తన సొంత జిల్లా చిత్తూరుకు వెళ్తూ నెల్లూరు వద్ద జూన్ 26వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంటనే అతడిని నెల్లూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించి ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను చెనైకి తరలించారు. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో గాయాలవడంతో శస్త్రచికిత్స కూడా చేశారు. మహేశ్ వైద్యానికి ఏపీ ప్రభుత్వం కూడా తనవంతు సాయం చేసింది. అయినా కూడా కత్తి మహేశ్‌ ప్రాణాలు దక్కలేదు
          కత్తి మహేష్ చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో స్నాతకోత్సవ విద్యను అభ్యసించారు. సినీ దర్శకుడు అవ్వాలన్న ఉద్దేశంతో. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ‘ఊరు చివర ఇల్లు’ కథ ఆధారంగా ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశారు.  ప్రముఖ టెలివిజన్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-1లో 27రోజుల పాటు కొనసాగారు.కత్తి మహేష్‌కు సినీ రంగంపైనే కాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై విశేషమైన పరిజానం ఉంది. సినీ విమర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకొంటూనే దర్శకుడిగా మారారు.  పలు టెలివిజన్‌ ఛానళ్లు, యూట్యూబ్‌ వేదికగా సినిమాలను విశ్లేషించేవారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.