లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీ ఉన్నవారికి ప్రీమియంకు సంబంధించి అద్భుత అవకాశం ఇస్తోంది. ఎల్ఐసీ పాలసీ ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లిస్తే ఎల్ఐసీ పాలసీ యాక్టీవ్‌గా ఉంటుంది. ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది.ల్యాప్స్ అయిన పాలసీతో బీమా బెనిఫిట్స్ ఉండవు.అంటే పాలసీ ల్యాప్స్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ పాలసీ ల్యాప్స్ అయితే పునరుద్ధరించుకొని యాక్టీవ్ చేయొచ్చు. ఈ అవకాశం ఎప్పుడూ ఉండదు. ఎల్ఐసీ తరచూ పాలసీ రివైవల్ క్యాంపైన్ ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఎల్ఐసీ పాలసీ రివైవల్ క్యాంపైన్ ప్రకటించింది. 2021 ఆగస్ట్ 23న ఈ క్యాంపైన్ ప్రారంభమైంది. 2021 అక్టోబర్ 22 వరకు పాలసీ రివైవల్ క్యాంపైన్ కొనసాగుతుంది. ఈ రెండు నెలలు పాలసీహోల్డర్లు ల్యాప్స్ అయిన తమ పాలసీలు రివైవ్ చేసుకోవచ్చు. ఎల్ఐసీ. రూ.1,00,000 లోపు ప్రీమియంపై ఆలస్య రుసుములో 20 శాతం లేదా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. రూ.1,00,000 నుంచి రూ.3,00,000 వరకు ప్రీమియంపై ఆలస్య రుసుములో 25 శాతం లేదా రూ.2,500 వరకు తగ్గింపు, రూ.3,00,000 కన్నా ఎక్కువ ప్రీమియంపై ఆలస్య రుసుములో 30 శాతం లేదా రూ.3,000 వరకు తగ్గింపు ఆఫర్స్ కూడా ప్రకటించింది. మొదటి ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదేళ్లలో పాలసీ రివైవ్ చేయొచ్చు. టర్మ్ పూర్తి కాని పాలసీలనే రివైవ్ చేయొచ్చు.పలు కారణాల వల్ల సమయానికి పాలసీ ప్రీమియం చెల్లించని పాలసీ హోల్డర్లు తమ ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కోల్పోకుండా ఉండేందుకు ఈ రివైవల్ క్యాంపైన్ ప్రారంభిస్తున్నట్టు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC తెలిపింది.