కష్ట కాలంలో ప్రభాకరన్న కు అండగా నిలవాలి.
నామినేషన్ కార్యక్రమంలో ప్రభాకరన్న కు తోడుగా పాల్గొన్న మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు.
దుబ్బాక; దుబ్బాక కు సేవ చేయడానికి వొచ్చిన ప్రభాకరన్న ఆసుపత్రిలో అత్యవసర చికిత్స లో ఉన్నాడు..కష్ట కాలంలో ప్రభాకర్ రెడ్డికి అండగా నిలిచి దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగుర వేయాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు...దుబ్బాకలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంకు హాజరై.న మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పూర్తి స్థాయిలో కష్టపడి అండగా నిలవలన్నారు. దుబ్బాక అంటే సీఎం కేసీఆర్ కు, తనకు అమితమైన ప్రేమని, హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల లెక్క దుబ్బాక-సిద్దిపేట లకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు..ఉప ఎన్నికల్లో ఎం కోల్పోయామో ఇప్పటికే గ్రహించారని, నవంబర్30న కారు గుర్తు ప్రభంజనం ఖాయమన్నారు. ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్న ప్రభాకరుడు దుండగుడు చేసిన దాడిలో తృటిలో ప్రాణాపాయం నుండి ప్రభాకర్ రెడ్డి తప్పించుకున్నాడు అని హరీశ్ రావు వివరించారు.. దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే.. నన్ను కాపాడాలి అని ప్రభాకరన్న బాధతో నాతో మాట్లాడారు. నాకు ఏడుపు వొచ్చేసింది.. ఎంత మంచి వ్యక్తి, చీమెకు కూడా హాని చేయని వ్యక్తని ,ఎంపీ పదవిని వదులుకొని మీకు సేవచేయడానికి వచ్చిన వ్యక్తి కి ఎంత ఆపద వొచ్చిందన్నారు...నారాయణ ఖేడ్ సభ కు వెళుతున్న సందర్భంలో నేను వెనక్కి మరలి వొచ్చాను.. హుటాహుటిన గజ్వెల్ ఆసుపత్రికి, అక్కడి నుండి గ్రీన్ చానల్ ద్వారా..హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ..సీఎం కేసీఆర్ కూడా రెండు మూడు సార్లు కాల్ చేశారు..రావాలా అన్నారు.. నేను ఆసుపత్రిలో ఉన్న సార్, మీరు సభ జరుపుకుని రావాలని చెప్పాను..6 గంటలకు సీఎం కేసీఆర్ బేగంపేట కు వొచ్చిన తర్వాత కాల్ చేశాడు రావాలా అని మాట్లాడగా, , ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు 8వరకల్లా రావాలని తెలపడం జరిగిందన్నారు. .తీవ్రంగా గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి పొట్ట కింది భాగంలో 15 సెంటీమీటర్లు కడుపు కట్ చేసి, 10 సెంటీమీటర్లు చిన్న పేగు కట్ చేశారు.. జరిగిన సంఘటన చూసి సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు..కొందరు రెచ్చగొట్టడం మూలంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. ఆనాడు రామలింగారెడ్డి లేనపుడు,
నేడు ప్రభాకరన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచార కార్యక్రమంకు రావాల్సి రావడం బాధాకరం..ఈరోజు ఆసుపత్రికి వెళితే ప్రభాకరన్న కు మాట్లాడటం రావడం లేదు..కళ్ళ నుండి నీళ్ళు వొస్తున్నాయి..బాదేసింది... ఈనెల 3నుండి నామినేషన్ పర్వం మొదలు అవుతుంది..ప్రభాకరన్న ఇంకా ఆసుపత్రి నుండి రావడానికి వారం రోజుల వరకు సమయము పట్టవచ్చు. దుబ్బాక ప్రజలు ఎం కోల్పోయారో తెలుసుకున్నారు..దుబ్బాక ఉద్యమ స్ఫూర్తి, దుబ్బాకలో గులాబీ జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్నారు..ఎవరో చెప్పలేదు అనో, మాట్లాడలేరు అనో అలగొద్దు, ఇందులో ఉండి మోసం చేస్తే తల్లిని మోసం చేసినట్లే,అవుతుంది.. వారు మనిషే కాదు అంటున్న..మనిషి అంటే జాలి, దయా, ప్రేమ గుణం ఉండాలి, కష్ట కాలంలో అండగా ఉండాలి అలాంటి వారెనే స్నేహితుడు అంటారు....మన అభివృద్ధి చెప్పుకోవాలి అంటే చాతాడు అంత ఉంది. తెలంగాణ రాకుంటే కాళేశ్వరం వొచ్చేది కాదు, 24 గంటల కరెంటు వొచ్చేది కాదు, కాంగ్రెస్ వాళ్లు పన్నులు వసూలు చేశారు, కానీ రైతులకే డబ్బులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందన్నారు.. రైతు బంధు ను 8 వేల నుండి 10 వేల వరకు, 11 విడతల్లో 72 వేల కోట్లు ఇచ్చారు, రైతు బంధు దుబారా అని ఉత్తమ్, బిచ్చమ్ ఎస్తున్నారు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతారు, రైతులను అవమాన పరుస్తున్నారు..యాసంగి రైతు బంధు ఆపాలి అని జాతీయ నాయకులు పిర్యాదు చేసారు. రైతులను అవమానం చేసిన వారికి కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి 5 గంటల కరెంటు ఇస్తున్నాము అని అంటున్నాడు..కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే.. కొండ నాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక పోయినట్లు ఉంటుంది.. ఇక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 5 గంటల కరెంటు ఇస్తా మని తాండూరు సభలో చెప్పాడు..5గంటల కరెంటు తో , మన తెలంగాణ లో వ్యవసాయం జరుగుతుందా, నెత్తిల బుర్ర ఉన్నోళ్లు వాళ్లకు ఓట్లు వేస్తారా, బీజేపీ వాళ్ళు దొడ్డు బియ్యం కొనము , నూకలు అవుతాయి అన్నారు,నూకలు బుక్కాలి అన్నారు.. దుబ్బాకలో బీజేపీ కి నూకలు బుక్కీయ్యాలి, ఎండలు కొడుతున్నాయి, వానలు లేవు పంటలు ఎండిపోతున్నాయి అని ప్రభాకరన్న కాల్ చేయగానే, రామాయంపేట కాలువకు నీళ్లు విడిచాము.ఇక కాళేశ్వరం మునిగింది అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.. ఒక పిల్లరు దిగగానే ప్రాజెక్టు మునిగిపోయింది అంటున్నారు.. దానికి గ్యారెంటీ ఉంది వల్లే పనిచేస్తారు..కాంగ్రెస్ వాళ్లు ఫికర్ పెట్టుకోవద్దు..కాంగ్రెస్ వాళ్లు మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్ కు వొచ్చి చూడాలి, పారుతున్న కాలువలు, పొంగి పొర్లుతున్న వాగు వంకలు, చెరువు కుంటలు చూడాలి..ప్రాజెక్టులో నీటి నిలువ ఉంచడం జరిగింది.. యసంగిలో మనకు డోకా లేదు....కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి అంటూ దుష్ప్రచారం చేయడం అవివేకం కాదా... నాడు లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి, నేడు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావడం లేదా, దొంగ కరెంటు కావాలా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో 7 గంటల కరెంటు ఇస్తున్నారు..ధైర్యము ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్, 400.కె సిలిండర్ ఇస్తాం, తెలంగాణ లో బీజేపీ కి 3 సీట్లు కూడా రావు, బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, బీఆర్ఎస్ సెంచరీ చేయడం ఖాయం, , తాండూరు లో డీకే శివకుమార్ 5 గంటలు అన్న తర్వాత కాంగ్రెస్ హిట్ వికెట్, కావడం ఖాయం..అన్ని సర్వేల్లో సీఎం కేసీఆర్ అని కోడై కూస్తే, వీళ్ళతో ఎం పని. సుజాతమ్మ గెలిస్తే సీఎం కేసీఆర్ తో నిధులు తెచ్చే వాళ్ళము.రేషన్ షాపు లకు సన్నబియ్యం, రైతు బంధు 16 వేలు, రేషన్ కార్డు దారులకు 5 లక్షల బీమా, ఆసరా పించిన్ వాళ్ళు సీఎం కేసీఆర్ వైపే చూస్తున్నారు..అర్ధరాత్రి వెళితే వాళ్ళ దగ్గర పైసలు దొరుకుతాయి.. ..వాళ్ళు నియ్యత్ ఉన్నోళ్లు అని 5వేలు పించిన్ పెంచడం జరుగుతుంది..ఆసరా, బీడీ కార్మికులకు చెప్పాలి, వికలాంగులకు పించిన్ 6వేలు అవుతాయి..సౌభాగ్య లక్ష్మీ ద్వారా మహిళకు 3వేలు అందిస్తాం.. ప్రతి ఇంటికి చెప్పాలి.తెలంగాణ కోసం జైత్రయాత్ర, లేదంటే సంస్మరణ యాత్ర, అని .కేసీఆర్, 11 రోజులు దీక్ష చేసి తెలంగాణ సాధించాడు. ఎమ్మెల్యే ఒక్క పని చేశాడా..దుబ్బాక ఉప ఎన్నికల్లో హామీలు గుప్పించి గెలిచిన ఎమ్మెల్యే ఒక్క పని అయినా చేశాడా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి నిరుద్యోగికి భృతి, కార్పోరేట్ పాఠశాల, ఉచిత కార్పోరేట్ ఆసుపత్రి, స్కిల్ డెవలప్ మెంట్, ఔటర్ రింగ్ రోడ్డు, డిగ్రీ కళాశాలలు, నూతన పరిశ్రమలు, పుస్తె మట్టెలు, ఎడ్లు బండి, కల్లాలు వీటిలో ఒక్కటైన అమలు చేశాడా అని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడో ఒక్కసారి మనదగ్గరికి వొచ్చే కేంద్ర మంత్రులతో మనకు ఎం పని, మీకు అందుబాటులో ఉంటా, అర్ధరాత్రి, అపరాత్రి అయినా మీకు అండగా ఉంటా, సిద్దిపేట తరహాలో దుబ్బాక అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని, ఎన్నికల్లో ఘన విజయం దక్కేలా అందరూ ప్రభాకర్ రెడ్డి లా కథానాయకులై ముందుకు సాగాలని ఆయన కార్యదీక్షులను చేశారు..ప్రతి మండలానికి వొచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన భరోసా ఇచ్చారు. సమావేశానికి వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెళ్లి విరిసింది..అంబులెన్స్ లో వొచ్చిన ప్రభాకర్ రెడ్డి ని చూసి బీఆర్ఎస్ శ్రేణులు బాధకు లోనయ్యారు..అండగా ఉంటామని పేర్కొన్నారు.